జాతీయ స్థాయి ఆన్లైన్ భగవద్గీత కంఠస్థ పోటీల్లో ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటకు చెందిన కట్టా వైదేహి ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. ఈనెల 11న కర్ణాటక రాష్ట్రం మైసూరు గణపతి సచ్చిదానందస్వామి దత్తపీఠం నిర్వహించిన పోటీల్లో వైదేహి 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను అలవోకగా కంఠస్థం చేసి అబ్బురపరిచింది. ప్రథమ స్థానంలో నిలిచి గురువారం బంగారు పతకానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.