ఆళ్లగడ్డలోని ఆశ్రమం వీధికి చెందిన రైతు చాకలి జ్వాలా నరసింహుడు (చిన్ని) అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక గడ్డి మందు తాగి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. కౌలు పొలం సాగుచేస్తూ పంట నష్టాలతో అప్పులు పెరిగాయి. బ్యాంకు, బయటి అప్పుదారుల ఒత్తిడి భరించలేక మనస్తాపం చెందిన ఆయన ఇంట్లో ఒంటరిగా గడ్డి మందు తాగాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.