తెలంగాణ భాషా పరిరక్షణకు,ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ గారు చేసిన సేవలు చిరస్మరణీయం జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు.తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు తెలిపారు.మంగళవారం ఉదయం కాళోజీ 111వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయo లో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ పూలమాల వేసి నివాళులు అర్పించారు.