సిరిసిల్లలో ఓ బొజ్జ గణపయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తూ భక్తులను కనువిందు చేస్తున్నాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణం 36వ వార్డు బి.వై నగర్ కు చెందిన హిందూ ప్రిన్స్ ఆధ్వర్యంలో తమిళనాడులోని పళని సుబ్రమణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్న వినాయకుని ఏర్పాటు చేశారు. మండపాన్ని కూడా అచ్చం పళని మురుగన్ ఆలయాన్ని తలపించేలా పిఓపి తో రూపొందించారు. అంతేకాకుండా విగ్రహం ఎదుట నెమలి బొమ్మ, మండపం ఎదుట ధ్వజస్తంభాన్ని కూడా స్థాపించడంతో గణేష్ మండపం అచ్చం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని తలపిస్తోంది. దాంతో జిల్లా నలుమూలలోని భక్తులు, ప్రజలు మురుగన్ రూపంలో ఉన్న ఈ బొజ్జ