కూటమి ప్రభుత్వం స్కాములు చేస్తుందని మాజీమంత్రి కొండపి వైసిపి ఇన్ ఛార్జ్ ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాలకు మీడియాతో మాట్లాడారు. యూరియా కొరత పై మంగళవారం జరిగే నిరసన కార్యక్రమాలు మరియు వినతి పత్రాలు అందించే విషయంపై వివరాలు వెల్లడించారు. అలానే యూరియా కొరత లేదని కూటమి ప్రభుత్వం చెబుతుందని ఎద్దేవా చేశారు. మొబైల్ ఫోన్లో యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వేచి చూస్తున్నా వీడియోలను ఆదిమూలపు సురేష్ మీడియాకు చూపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.