అనంతపురం నగర శివారులోని శ్రీనగర్ కాలనీ ఇంద్రప్రస్థ వద్ద ఇటీవల జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతలు బాహా బాహికి దిగిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆయా సోషల్ మీడియా వేదికలలో తన్నుకున్న తమ్ముళ్లు అంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ నేతలు సభ సక్సెస్ అయ్యిందంటూనే ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారడంతో సందిగ్ధం నెలకొంది.