ఇస్లాంపూర్ పాఠశాల గ్రౌండ్ లోకి చేరిన వర్షపు నీరు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. పాఠశాలకు సమీపంలో ఉన్న పైడికుంట నిండిపోవడంతో ఆ నీరు పాఠశాల ఆవరణలోకి చేరిందని స్థానికులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.