బొండపల్లి మండలం కిండాం అగ్రహారం గ్రామపంచాయతీ సర్పంచ్ బుంగ దేవుడు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. సర్పంచ్ దేవుడు కి గుండెపోటు హఠాత్తుగా రాగా ఒకసారిగా కుప్పకూలి పడిపోవడంతో కుటుంబీకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సర్పంచ్ దేవుడు మృతి చెందారు కాగా గ్రామపంచాయతీ సర్పంచ్ దేవుడు మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.