కావలి ఎమ్మెల్యేది అధికార మదం : వైసీపీ జాయింట్ సెక్రెటరీ పేర్నెటి కోటీశ్వర రెడ్డి అధికార మదంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని వైసీపీ జాయింట్ సెక్రెటరీ పేర్నెటి కోటీశ్వర రెడ్డి మండిపడ్డారు. అయన మాటలను మహిళలు కూడా అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను ప్రశ్నించిన ఎమ్మెల్సీపై కావలి ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం దారుణమని గురువారం సాయంత్రం 6:00కి అన్నారు.