కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడుకున్న విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్బంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ లిఖిత, ప్రిన్సిపాల్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.