కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని ఖాదరాబాద్ గ్రామంలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గవర్నమెంట్ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, చెత్తను సక్రమంగా పారవేయాలని, వర్షపు నీటిని సంరక్షించుకోవాలని, చెట్లు నాటాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు