రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో రైతులు జాగ్రత్తగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారితో మాట్లాడుకుని ఇక్కడి రైతుల పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని మోసం చేస్తారని తెలిపారు. కావున రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.