నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం పదిన్నర గంటలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని జ్యోతి ప్రజలను చేశారు. అంకిత భావనతో ఉపాధ్యాయులు బోధనలో ప్రతిభ కనబరిచిన 51 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకే కాక తోటి ఉపాధ్యాయులకు ప్రేరణ కావాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు వారు. పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా పిల్లల్లో క్రమశిక్షణ నైతిక విలువలు సమాజానికి ఉపయోగపడే గుణాలు నాటుతున్నారని తెలిపారు.