పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరు ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 237 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రిన్సిపల్ మేరీ సుజన్ తెలియజేశారు. మొత్తం 258 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆమె తెలియజేశారు.