వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు నిబంధనల మేరకు జాగ్రత్తలు చేపట్టారా లేదా అన్న విషయాలను వేంపల్లి సీఐ నరసింహులు పరిశీలించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విగ్రహాల నిమజ్జనం చేసే తేదీ ని పోలీసులకు తెలపాలని చెప్పారు. నిమజ్జనం చేసే సమయంలో మద్యం సేవించరాదన్నారు. నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలను వెంట తీసుకెళ్ల కూడదని చెప్పారు. పలు విషయాలపై కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.