YCP కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్: కృష్ణయ్య KVBపురం మండల కేంద్రంలోని YCP కార్యాలయంలో గురువారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ మండల సమన్వయకర్త గవర్ల కృష్ణయ్య ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ YSR కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని తెలిపారు. కూటమి పాలనలో ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారు డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు.