గురువారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సీజనల్ వ్యాధులపై కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎంపీడీవోలకు వెబ్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలుపెట్టని లబ్ధిదారులందరికి గ్రౌండ్లింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా వర్షాలు కురుస్తుంది నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీలో గ్రామాలలో ఫ్రైడే కార్యక్రమాలను చురుగ్గా చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.