శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం చౌడేపల్లిలో అర్ధరాత్రి లక్షమ్మ నిద్రిస్తున్న సమయంలో నిందితులు చోరీకి పాల్పడ్డారు.అదే గ్రామానికి చెందిన శిద్దారెడ్డి, రాజ శేఖర్.. లక్ష్మమ్మను బెదిరించి మెడలో ఉన్న 18 గ్రాముల బంగారు చైను దోపిడీ చేసి పరారయ్యారు. బుధవారం మధ్యాహ్నం మహమ్మదాబాద్ క్రాస్ సమీపంలో వారిని నల్లమాడ సీఐ నరేంద్ర రెడ్డి అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు.