ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం జనసేన పార్టీ ఇంచార్జ్ గౌతమ్ రాజు ఆగస్టు 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు తరలిరావాలని కోరారు. పార్టీ బలోపేతం జనసైనికుల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.