గురువారం సాయంత్రం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇందిరమ్మ ఇండ్లు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అన్ని మండలాల,మున్సిపాలిటీల వారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి పై వివరాలు అడిగి తెలుసుకుని,తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఇల్లు మంజూరు అయిన ప్రతి ఒక్కరు నిర్మాణపు పనులను పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు అన్ని సహాయ సహకారాలను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.