ఘంటసాల మండలం వైసిపి అధ్యక్షులు వేమూరి వెంకట్రావు శుక్రవారం మాట్లాడుతూ, రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మండల వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి మూడో కోటాకు యూరియాను తక్షణమే అందించాలని ఆయన కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.