విజయవాడలోని సితార గ్రౌండ్స్లో ప్రతిష్ఠించిన 72 అడుగుల మట్టి వినాయకుడి నిమజ్జనం శనివారం అట్టహాసంగా జరిగింది. డూండి రాకేష్ సేవ సమితి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడిని ప్రతిష్ఠించిన చోటే ఫైర్ ఇంజిన్ సాయంతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.