కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో శుక్రవారం ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో 5.40 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిరంజీవి అనే వ్యక్తి కారులో గంజాయిని తరలిస్తుండగా అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ శంకర్ తో పాటు ఎస్సై హనుమంతు, అనుదీప్, సతీష్ పాల్గొన్నారు.