జమ్మికుంట పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి పలు విధుల గుండా పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో జవాన్లతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వీధుల గుండా జవాన్లతో కలిసి కవాతు నిర్వహించామని రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు దుర్గ మాత ఉత్సవాలు రానున్న ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని కవాతు నిర్వహించామని అన్నారు. అనంతరం పట్టణానికి చెందిన పుర ప్రముఖులు జవాన్లను పూలదండలు శాలులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రామక్రిష్ణ తో పాటు పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాల జావాన్లు పాల్గొన్నారు.