కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం మూడవ రోజు వినాయచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజు సందర్బంగా పలుచోట్ల గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం కొన్ని వినాయకుల ప్రతిమల నిమర్జనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు..