ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో ఓ మహిళ అనుమానస్పద మృతి చెందింది. శనివారం రాత్రి ప్రాణాలతో కనిపించి నిద్రించిన మహిళ ఆదివారం ఉదయం మృతి చెందిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మూతురాలి ఇంటిలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాన్ని పరిశీలించారు. మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ పూర్తి విచారణ చేయాలని డిఎస్పి పోలీసు సిబ్బందిని ఆదేశించారు.