సుందర పర్యాటక నగరిగా విశాఖకు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది.ఏటా లక్షలాది మంది పర్యాటకులకు ఇక్కడికి వస్తుంటారు. వీరిలో అధికశాతం ఆర్కే బీచ్, ఇతర తీర ప్రాంతాలను సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.అంతటి ప్రాధాన్యం కలిగిన బీచ్‌లను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది. ఎక్కడికక్కడ సముద్రంలో మురుగునీరు చేరుతుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇది పర్యాటక వృద్ధిపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీచ్‌ల స్వచ్ఛతపై దృష్టి సారించి నగర పర్యాటకానికి మరింత ఊపు తేవాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.