రాజీమార్గమే రాజమార్గమని కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయ సేవాధికర సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంబించారు న్యాయమూర్తి శివకుమార్. ఈ లోక్ అదాలత్ కు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు,పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ..సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 20,500 పైగా కేసులు ఉన్నాయన్నారు. 2,200 కేసులను లోక్ అదాలత్ లో పరిష్కారానికి తీసుకొచ్చామన్నారు.