సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్నగర్ కట్టను రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ఎస్ సందర్శించి, చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక నిమజ్జనం పై మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 గణనాధులు నిమజ్జనం కాగా, ఇంకా 20000 విగ్రహాల వరకు రాచకొండ పరిధిలోని పలు చెరువులు, కుంటలలో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.