పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడటం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొల్లా చేస్తున్న నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ పేర్కొన్నారు. శవ రాజకీయ సంస్కృతి వైసీపీ ది అంటూ తెలిపారు. అభివృద్ధిని ఓర్చుకోలేక వైసిపి దుష్ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.