ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ వెలుగు కార్యాలయంలో మండల మహిళా సమైక్య ఏపీఎంగా శ్రీమాదల లక్ష్మమ్మ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. స్వయం సహయక మహిళా సంఘాల సభ్యులు నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించాలన్నారు. విధుల పట్ల ఎవరూ అలసత్వం వహించొద్దని కోరారు. అనంతరం కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శివ రంగడు, సభ్యులు మహిళలు పాల్గొన్నారు