తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ వీధి సమీపంలో కుటుంబ కలహాలతో దుస్తులు శుభ్రం చేసే ద్రావణం తాగి మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే బంగారమ్మ వీధి సమీపంలోని ఓ వివాహిత తన భర్తతో విభేదాలు రావడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వివాహిత దుస్తులు శుభ్రం చేసే ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కుటుంబ సభ్యుల హుటాహుటిన ఏరియాస్ పత్రిక తరలించగా ఏరియా ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు, చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తున్నట్లు సమాచారం