భూపాలపల్లి నియోజకవర్గంలోని ఘనపురం, రేగొండ చిట్యాల మండలాల్లో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మృతి చెందిన మృతదేహాలకు నివాళులర్పించి, ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. చనిపోయిన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.