వినాయక చవితి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ మహాగణపతి దేవాలయానికి భక్తులు బారులు తీరారు. బుధవారం తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు గణపతి మాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అర్చకుడు ఓం ప్రకాష్ తెలిపారు.