ఇల్లందు మం.పొలారం గ్రామానికి చెందిన 40 సంవత్సరాల మోటపోతుల అప్పారావు అనే గీత కార్మికుడు సమీపంలోని రామకృష్ణాపురం గ్రామంలో తాటి చెట్టు ఎక్కి దిగే క్రమంలో పట్టు తప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన అప్పారావును స్థానికులు ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడికి భార్య,ఇద్దర పిల్లలు ఉన్నారు.