మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మధ్యం తాగినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా యస్పి సుధీర్ రామ్నాథ్ కేక రిపోర్ట్ పంపగా సస్పెండ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.