కర్నూలు నగరంలోని గణేష్ నగర్ లో ఉన్న సాయి వైభవం అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న శివలీల అనే 80 సంవత్సరాల వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో శివ లీల ఒంటరిగా ఉన్న సమయాన్ని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి వెళ్లి హత్య చేసి ఆమె మెడలో ఉన్న నగలు నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శివ లీల రక్తపు మరకలతో ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.