దాహేగం మండల కేంద్రంలో జరుగుతున్న వార సంతలో రైతులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పలువురు రైతులు చిరు వ్యాపారులు వివరించారు. రైతులు తమ కూరగాయలు అమ్ముకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా వారి సమస్యల పరిష్కారం కోసం ఒక రైతు మార్కెట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు,