శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల పరిధిలోని కుటాగుళ్లలో వినాయక నిమజ్జనం మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక ప్రతిమలను ట్రాక్టర్లో కొలువుదిర్చి ఘనంగా శోభాయాత్రను నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా డీజీలు డప్పు వాయిద్యాలకు యువత మహిళలు పిల్లలు నృత్యాలు చేస్తూ భక్తి భావంతో శోభాయాత్రను జరిపారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు