అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారిని మేళ తాళాలతో, బాజా బజంత్రీలతో మూషిక వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వామి వారికి పలు సేవల ద్వారా రూ.6,50,102 ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమీషనర్ వెల్లడించారు.