జేసిబి సహాయంతో ఒడ్డుకు చేరుకున్న రైతులు మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి పెద్ద తండా గ్రామంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బుర్ణం కుంట చెరువు పూర్తిగా నిండి చెరువు నుంచి ఒక్కసారిగా నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. కొందరు రైతులు సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లడంతో వరదల్లో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సాయంత్రం జేసిబి సహాయంతో రైతులను ఒడ్డుకు చేర్చారు. రైతులు ఒడ్డుకు చేరుకోవడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు