వెంకటాపురం (మం) ఇప్పలగూడెం గ్రామంలో మద్యం మత్తులో అత్త కొండగొర్ల ఎల్లమ్మ ను మద్యం మత్తులో అల్లుడు విజయ్ కుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. చొక్కాల గ్రామానికి చెందిన ఎల్లమ్మ తో తన వద్ద ఉన్న డబ్బులు, బంగారం ఇవ్వాలని రాత్రి అల్లుడు గొడవ చేయడంతో, తలదాచుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్ళింది. నేడు గురువారం రోజున ఉదయం కూరగాయల కోసం వెళుతుండగా మాటు వేసి నడిరోడ్డుపై గొడ్డలితో విజయ్ కుమార్ నరికి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.