కర్నూలు నగరంలో వినాయక చవితి సందర్భంగా కర్నూలు కలెక్టరేట్ లో పరిపాలన అధికారులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బుధవారం ఉదయం 11 గంటలకు కర్నూలు జాయింట్ కలెక్టర్ డా.నవ్య, డిఆర్ఓ,కర్నూల్ గణేష్ ఉత్సవ సమితి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో అనేక చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేశారని మండపం నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని జేసీ నవ్య జిల్లా ప్రజలను కోరారు.