నందిగామలో సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో వాకింగ్ చేస్తున్న ఒక మహిళ మెడలో 7 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును ఇరువురు దుండగులు బైక్ పై వచ్చి లాక్కొని వెళ్లారు. మహిళ లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవియల్ నాయుడు తెలిపారు.