పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం వద్ద సువర్ణముఖి నది బ్రిడ్జిపై గురువారం మధ్యాహ్నం ఇరువైపులా రెండు కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. వంతెనపై ఆర్టీసీ బస్సుకు ఎదురుగా ఆయిల్ ట్యాంకర్ రావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం నెలకొంది. పార్వతీపురం వైపు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు అలాగే విజయనగరం వైపు చినబోగిలి వరకు సుమారు గంట సమయం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, భారీవాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహన చోదకులు అసహనానికి గురయ్యారు.