ఆళ్లగడ్డలో హోంగార్డులకు మాక్ డ్రిల్ శిక్షణ,ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం నంద్యాల సర్కిల్ పరిధిలోని హోంగార్డులకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల హోంగార్డ్స్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రవీంద్ర ఆధ్వర్యంలో రెండు గంటలపాటు శారీరక దారుఢ్యం కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. తరచూ ఇలాంటి డ్రిల్లులు ఏర్పాటు చేసి హోంగార్డుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామని శిక్షణాధికారి తెలిపారు.