Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక హాజరై టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పని చేశారని కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ తుపాకీకి ఎదురునిలిచి గుండె చూపిన ధైర్యశీలి అని అన్నారు. అకుంఠిత ధైర్యసాహసాలకు అసమాన ప్రతిభకు నిదర్శనమన్నారు.