ములుగు మండలం మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ అనే మున్సిపాలిటీ కార్మికుడు ఇటీవల జీతాలు రాలేదని మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు మంత్రి సీతక్క మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.4 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్ ను అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే మృతుడి భార్యకు ఉద్యోగం కల్పిస్తామని సీతక్క అన్నారు.