కూచిపూడి దేవాలయాల్లో దొంగతనాలు చేసిన ముద్దాయి అరెస్ట్, 1680 గ్రా. వెండి, 14 మంగళ సూత్రాలు, 259 గ్రా. శట గోపురం స్వాదీనం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసూరు గ్రామంలో ఉన్న క్షత్రియ రామాలయం, శ్రీ సంతాన వేణు గోపాల స్వామి గుడి, శ్రీ మహాలక్ష్మి సమేత గంగానమ్మ గుడి మరియు వినాయక మందిరాల లోకి ఎవరో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి దేవుళ్ళ వెండి ఆభరణాలు, బంగారు మంగళ సూత్రాలు మరియు హుండీ డబ్బులు చోరీ చేసినట్లు ఫిర్యాదు రాగా సదరు పిర్యాదు పై కూచిపూడి పోలీసు స్టేషన్ నందు కేసు చెసి పొలీసులు దారియప్త్ చేపట్టారు.