నమ్మి కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసించే రెండో తిరుపతిగా పేరుగాంచిన బుగులోని వెంకటేశ్వర స్వామి గుట్టలను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారు గుట్టల్లో ఉన్న బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి కొరకు అటవీ శాఖ నిధులు రూ.160 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బుగులోని వెంకటేశ్వర స్వామి గుట్టలను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తానని అన్నారు.